+91 99635 77856

డంపింగ్ యార్డు వ్యతిరేకంగా బీజేపీ నిరసన

Kudikala Sai Editor
maaksharamnews.in

డంపింగ్ యార్డు వ్యతిరేకంగా బీజేపీ నిరసన

హుజురాబాద్/ మార్చి 30 (మా అక్షరం):పట్టణ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.పర్యావరణ కాలుష్యం, దుర్వాసన, ఆరోగ్య సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని నిరసనకారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డంపింగ్ యార్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం బిజెపి నాయకులు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డును తరలించాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాముల కొమురయ్య, పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగ్గిశెట్టి ప్రభాకర్, పైళ్ల వెంకట్ రెడ్డి, పారిపెల్లి కొండాల్ రెడ్డి, కౌన్సిలర్ తూర్పాటి లక్ష్మి, దుర్గ, నరాల రాజశేఖర్, తిప్పబతిని రాజు, మర్రి రవిందర్, నరెడ్ల చైతన్య రెడ్డి, కొంకటి రమేష్, మంచికట్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ మార్చి 30 (మా అక్షరం):పట్టణ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.పర్యావరణ కాలుష్యం, దుర్వాసన, ఆరోగ్య సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని నిరసనకారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డంపింగ్ యార్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం బిజెపి నాయకులు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డును తరలించాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాముల కొమురయ్య, పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగ్గిశెట్టి ప్రభాకర్, పైళ్ల వెంకట్ రెడ్డి, పారిపెల్లి కొండాల్ రెడ్డి, కౌన్సిలర్ తూర్పాటి లక్ష్మి, దుర్గ, నరాల రాజశేఖర్, తిప్పబతిని రాజు, మర్రి రవిందర్, నరెడ్ల చైతన్య రెడ్డి, కొంకటి రమేష్, మంచికట్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !