+91 99635 77856

హుజూరాబాద్‌లో డంప్ యార్డ్ ప్రతిపాదన రద్దు చేయాలి: ప్రణవ్

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజూరాబాద్‌లో డంప్ యార్డ్ ప్రతిపాదన రద్దు చేయాలి: ప్రణవ్

హుజూరాబాద్/ ఏప్రిల్03 (మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంప్ యార్డ్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ను కలిసి విజ్ఞప్తి చేశారు.డంప్ యార్డ్ వల్ల కలిగే అనర్థాలను వివరించిన ఆయన,ఈ ప్రాంతం వ్యవసాయానికి కీలకమైందని, ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. వ్యర్థాల కారణంగా పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.జనావాసాల మధ్య కాకుండా ఇతర అనుకూల ప్రాంతానికి డంప్ యార్డ్‌ను మార్చాలని సూచించారు. ఈ విషయంపై వారంలో రెండోసారి నరేందర్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లకుండా నిలిపివేయాలని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు వెల్లడించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !