హుజురాబాద్/ ఏప్రిల్ 04 (మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంప్ యార్డ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఉద్యమానికి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన శిబిరాన్ని సందర్శించి, ధర్నాలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులు ప్రాక్టికల్‌గా పని చేయవని, భూగర్భ జలాలు కలుషితమవుతాయని హెచ్చరించారు.జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను ఉదాహరణగా పేర్కొంటూ, అక్కడి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.హుజురాబాద్‌లో కూడా అలాంటి పరిస్థితులు రాకూడదని అన్నారు.డంపింగ్ యార్డ్‌ను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అవసరమైతే ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన తాను ఎల్లప్పుడూ ఉంటానని హామీ ఇచ్చారు.













