+91 99635 77856

హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డు వ్యతిరేక నిరసనలు ఉధృతం

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డు వ్యతిరేక నిరసనలు ఉధృతం

హుజూరాబాద్/ ఏప్రిల్ 08 (మా అక్షరం):
జనావాసాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్సఫర్ (DBFOT) విధానంలో ప్రైవేట్ సంస్థకు అప్పగించి ప్రభుత్వం చేపట్టిన డంపింగ్ యార్డు ప్రతిపాదనకు వ్యతిరేకంగా హుజూరాబాద్‌లో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి.ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలతో కలిసి నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్షను బుధవారం రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మహిళలతో కలిసి పండ్ల రసం అందించి విరమింపజేశారు.ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ,గత 17 రోజులుగా ప్రజలు విభిన్న రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమన్నారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే డంపింగ్ యార్డు ప్రతిపాదనను రద్దు చేసి వారం రోజుల్లో అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.అలా చేయకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !