+91 99635 77856

ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ

Kudikala Sai Editor
maaksharamnews.in

ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ

-డిపో క్రాస్ వద్ద లంచం తీసుకుంటూ పట్టుబాటు...

హుజురాబాద్/ ఏప్రిల్ 15 (మా అక్షరం): మున్సిపాలిటీకి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో బుధవారం చిక్కాడు. కాంట్రాక్టర్ బిల్లులు క్లియర్ చేయడానికి రూ.50 వేల లంచం డిమాండ్ చేసిన ఆయన, డిపో క్రాస్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.బాధితుడి ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో వెళ్లిన ఏసీబీ అధికారులు, నిర్దిష్ట ప్రదేశంలో పట్టు బిగించి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆయనను మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి, ఆయన ఛాంబర్‌లో రికార్డులను సోదా చేశారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగగా, పట్టణంలో చర్చనీయాంశంగా మారింది

Share ePaper Clip

Preparing image...

-డిపో క్రాస్ వద్ద లంచం తీసుకుంటూ పట్టుబాటు…

హుజురాబాద్/ ఏప్రిల్ 15 (మా అక్షరం): మున్సిపాలిటీకి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో బుధవారం చిక్కాడు. కాంట్రాక్టర్ బిల్లులు క్లియర్ చేయడానికి రూ.50 వేల లంచం డిమాండ్ చేసిన ఆయన, డిపో క్రాస్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.బాధితుడి ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో వెళ్లిన ఏసీబీ అధికారులు, నిర్దిష్ట ప్రదేశంలో పట్టు బిగించి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆయనను మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి, ఆయన ఛాంబర్‌లో రికార్డులను సోదా చేశారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగగా, పట్టణంలో చర్చనీయాంశంగా మారింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !