+91 99635 77856

డంపింగ్ యార్డ్ రద్దు కొరకు పోరాటం

-డంపింగ్ యార్డ్ రద్దు కొరకు పోరాటం…

-దీక్షకు ఉపసర్పంచ్ల సంఘీభావ …

హుజురాబాద్/ఏప్రిల్ 15( మా అక్షరం):పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గత 24 రోజులుగా కొనసాగుతున్న వేస్ట్ టు ఎనర్జీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేక నిరవధిక దీక్షకు మద్దతుగా హుజురాబాద్ మండల ఉపసర్పంచ్లు ఒకరోజు దీక్షలో పాల్గొన్నారు.
ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ ఆధ్వర్యంలో మండలంలోని 20 గ్రామాల ఉపసర్పంచ్లు సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రజలకు హానికరమని, వెంటనే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డ్ పూర్తిగా రద్దయ్యే వరకు మండలంలోని అన్ని గ్రామాల ఉపసర్పంచ్లు ఏకమై శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్య తీవ్రతను ప్రభుత్వానికి, పై అధికారులకు తెలియజేస్తూ తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి మద్దతుగా మండలంలోని ఉపసర్పంచ్లు మండ సతీష్, శనిగరపు ఐలయ్య, గీసిడి శైలజ, మహేందర్ రెడ్డి, బండి రాజు, బండి నరేష్, జనగామ రాజేశ్వరరావు, ఇప్పలపల్లి రామకృష్ణ, గిన్నారపు మహేందర్, బొల్లవేణి అజయ్, ఆవుల రాజకుమార్, నేరెళ్ల శ్రీనివాస్, జడల అశోక్ కుమార్, ఆవుల సంపత్, కాశిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నారాయణరెడ్డి, బిక్షపతి, జాలి, బలరాంరెడ్డి, పంజాల రాజు, సుధాకర్ అలాగే అఖిలపక్ష జేఏసీ సభ్యులు జనార్ధన్, సందేల వెంకన్న, హనుమంతరావు, జైపాల్ రెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొండల్ రెడ్డి, కాట్రపల్లి మాజీ సర్పంచ్ తొగరు బిక్షపతి పాల్గొని సంఘీభావం ప్రకటించారు.దీక్ష అనంతరం స్థానిక తహసీల్దార్‌కు మెమోరాండం సమర్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !