+91 99635 77856

రహదారులపై ధాన్యం పోయొద్దు – ప్రమాదాలు పెరుగుతున్నాయంటూ పోలీసుల హెచ్చరిక

Kudikala Sai Editor
maaksharamnews.in

రహదారులపై ధాన్యం పోయొద్దు – ప్రమాదాలు పెరుగుతున్నాయంటూ పోలీసుల హెచ్చరిక

హుజురాబాద్/ ఏప్రిల్ 27( మా అక్షరం):
రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని పట్టణ సీఐ టీ. కరుణాకర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధాన్యాన్ని రహదారులపై పోసి, టార్పాలిన్ కవర్లు, బండరాళ్లు పెట్టడం వలన వాహనదారులకు ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలకు దారితీస్తున్నట్లు తెలిపారు.ఈ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తూ, అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రైతులు వరి ధాన్యాన్ని కల్లాల వద్దనే ఆరబెట్టుకోవాలని, రహదారులపై ధాన్యం పోయకూడదని విజ్ఞప్తి చేశారు.ఇకపై రహదారులపై ధాన్యం నిలువలు పోసిన వారిపై నోటీసులు జారీ చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ ఏప్రిల్ 27( మా అక్షరం):
రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని పట్టణ సీఐ టీ. కరుణాకర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ధాన్యాన్ని రహదారులపై పోసి, టార్పాలిన్ కవర్లు, బండరాళ్లు పెట్టడం వలన వాహనదారులకు ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలకు దారితీస్తున్నట్లు తెలిపారు.ఈ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తూ, అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రైతులు వరి ధాన్యాన్ని కల్లాల వద్దనే ఆరబెట్టుకోవాలని, రహదారులపై ధాన్యం పోయకూడదని విజ్ఞప్తి చేశారు.ఇకపై రహదారులపై ధాన్యం నిలువలు పోసిన వారిపై నోటీసులు జారీ చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !