+91 99635 77856

ఎస్ఎస్సి ఫలితాల్లో మాంటిస్సోరి విద్యార్థుల విజయభేరి

Kudikala Sai Editor
maaksharamnews.in

ఎస్ఎస్సి ఫలితాల్లో మాంటిస్సోరి విద్యార్థుల విజయభేరి

హుజురాబాద్/ ఏప్రిల్ 29 (మా అక్షరం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో హుజూరాబాద్‌కు చెందిన మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు, అత్యధిక మార్కులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందినట్లు ప్రిన్సిపాల్ గీతా షాజు తెలిపారు.
ఈ ఫలితాల్లో భాగంగా జి. రిషి వర్ధన్ 600 మార్కులకు గాను 583 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఎం. నిహాల్ (581), జి. అభినవ్ (581), మహమ్మదీ బేగం (577), ఎం. ప్రణతి (573), కె. సాన్విత్ (571) మార్కులు సాధించారు. అదేవిధంగా, పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు 550 పైగా మార్కులు సాధించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ అభినందించారు. విజయోత్సవంగా పాఠశాల ప్రాంగణంలో,అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !