+91 99635 77856

పోలీస్ స్టేషన్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం

Kudikala Sai Editor
maaksharamnews.in

పోలీస్ స్టేషన్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం

హుజూరాబాద్/ ఏప్రిల్ 29 (మా అక్షరం):పోలీస్ సిబ్బంది సంక్షేమం, వసతి సౌకర్యాల మెరుగుదలకు భాగంగా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన “అమరవీరుల స్మారక బ్యారక్ సిబ్బంది విశ్రాంతి భవనం”ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి గౌరవార్థం ఈ భవనాన్ని నిర్మించామని తెలిపారు. ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేసే పోలీస్ సిబ్బందికి మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారు మరింత ఉత్సాహంతో విధులు నిర్వర్తించగలరని పేర్కొన్నారు.సిబ్బంది ఆరోగ్యం, సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పని వాతావరణాన్ని ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. తగిన వసతి సదుపాయాలు ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో అధికారులు మరింత సమర్థవంతంగా సేవలందించగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి,ఇన్స్పెక్టర్లు కరుణాకర్,శ్రీనివాస్, రామకృష్ణ,ఎస్సైలు ఆవుల తిరుపతి,స్వాతి, క్రాంతి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్/ ఏప్రిల్ 29 (మా అక్షరం):పోలీస్ సిబ్బంది సంక్షేమం, వసతి సౌకర్యాల మెరుగుదలకు భాగంగా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన “అమరవీరుల స్మారక బ్యారక్ సిబ్బంది విశ్రాంతి భవనం”ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి గౌరవార్థం ఈ భవనాన్ని నిర్మించామని తెలిపారు. ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేసే పోలీస్ సిబ్బందికి మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారు మరింత ఉత్సాహంతో విధులు నిర్వర్తించగలరని పేర్కొన్నారు.సిబ్బంది ఆరోగ్యం, సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పని వాతావరణాన్ని ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. తగిన వసతి సదుపాయాలు ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో అధికారులు మరింత సమర్థవంతంగా సేవలందించగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి,ఇన్స్పెక్టర్లు కరుణాకర్,శ్రీనివాస్, రామకృష్ణ,ఎస్సైలు ఆవుల తిరుపతి,స్వాతి, క్రాంతి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !