-మండలంలో 98.48% ఉత్తీర్ణత నమోదు…
హుజురాబాద్/ ఏప్రిల్ 29(మా అక్షరం): బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాలను మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. మండల పరిధిలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశాలలు సమిష్టిగా మంచి ఫలితాలు సాధించాయని తెలిపారు.మండలంలోని 13 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 156 మంది బాలురు,135 మంది బాలికలు మొత్తం 291 మంది పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 151 మంది బాలురు,132 మంది బాలికలు కలిపి 283 మంది ఉత్తీర్ణులయ్యారు.బాలుర ఉత్తీర్ణత శాతం96.79%, బాలికల ఉత్తీర్ణత శాతం 97.78%గా నమోదైంది. మొత్తం ఉత్తీర్ణత శాతం 97.25%గా ఉంది.అదేవిధంగా మండలంలోని 4 రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి 163 మంది బాలురు, 72 మంది బాలికలు మొత్తం 235 మంది హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాన్ని సాధించారు.మొత్తం ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల నుంచి 319 మంది బాలురు, 207 మంది బాలికలు కలిపి 526 మంది హాజరుకాగా, 314 మంది బాలురు, 204 మంది బాలికలు కలిపి 518 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 98.43%, బాలికల ఉత్తీర్ణత శాతం 98.55%గా ఉండగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 98.48%గా నమోదైంది.మండలంలోని 11 ప్రైవేట్ పాఠశాలల నుంచి177 మంది బాలురు,179 మంది బాలికలు మొత్తం 342 మంది హాజరుకాగా, వీరిలో 176 మంది బాలురు,178 మంది బాలికలు కలిపి 340 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 99.44%, బాలికల ఉత్తీర్ణత శాతం 99.44%గా ఉండగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 99.42%గా నమోదైంది.ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జడ్పిహెచ్ఎస్ బాలురు హుజురాబాద్ పాఠశాలకు చెందిన కళ్లెపు అభినవ శ్రీ 571 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. జడ్పిహెచ్ఎస్ చెల్పూరు పాఠశాలకు చెందిన గాలిబు చరణ్ 561 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు.ప్రైవేట్ పాఠశాలల విభాగంలో టెట్రాహెడ్రన్ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని A. సహస్ర 587 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, మాంటిసోరి పాఠశాలకు చెందిన G. రిషి వర్ధన్ 583 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించారు.













