-అత్యుత్తమ ఫలితాలకు చైర్‌పర్సన్ సుహాసిని అభినందనలు…
హుజూరాబాద్/ ఏప్రిల్ 29(మా అక్షరం): విద్యార్థులు ఉన్నతంగా చదివి సమాజాభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం ఆమె అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి నడవడికతో విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులకు, పట్టణానికి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురాగలరని పేర్కొన్నారు.పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన G. రిషి వర్ధన్ (583), M. నిహాల్ (581), G. అభినవ్ (581), మహమ్మదీ బేగం (577), M. ప్రణతి (573), K. సాన్విత్ (571)లను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ షాజూ థామస్, ఉపాధ్యాయులు రమేష్, అజ్మత్ అలీ, అబీద్ పాషా, తిరుపతి, రవీందర్,రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.













