+91 99635 77856

శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభా ప్రభంజనం

ఎల్కతుర్తి/ఏప్రిల్ 30 (మా అక్షరం): మండలంలోని ఇందిరానగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. మండల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి ముందువరుసలో నిలిచారు.ఈ ఫలితాల్లో వి. అశ్విత 587 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. నబిహా కౌసర్ 575 మార్కులతో ద్వితీయ స్థానం, పి. పూజ 574 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.ఇక బి. భావన (572), కే. శివాని (570), ఈ. కౌశిక్ (566), సిహెచ్. విశ్వతేజ (560), ఎమ్. సోనీ (551) మార్కులు సాధించి ప్రతిభ చాటారు. మండల స్థాయిలో ముందువరుసలో మొత్తం 9 మంది శ్రీ చైతన్య విద్యార్థులు నిలవడం విశేషం.మొత్తం 43 మంది విద్యార్థుల్లో 27 మంది 500కు పైగా మార్కులు సాధించగా, పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ బండారి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో టాపర్స్‌ను చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ఏజీఎం పద్మాకర్, కోఆర్డినేటర్ తిరుమలరెడ్డి, అకాడమిక్ డీన్ రజనీకాంత్ అభినందించారు.విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని స్వీట్లు పంచి, టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ ఫలితాలపై యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !