+91 99635 77856

తిమ్మాపూర్ ఈనాడు విలేకరి బొజ్జ రాజు మృతి

Kudikala Sai Editor
maaksharamnews.in

తిమ్మాపూర్ ఈనాడు విలేకరి బొజ్జ రాజు మృతి

 - పత్రికా రంగానికి తీరని లోటు...

కరీంనగర్/ మే 01(మా అక్షరం): తిమ్మాపూర్ మండలంలోని ఈనాడు పత్రికకు విలేకరిగా పనిచేస్తున్న బొజ్జ రాజు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఈ సంఘటన పత్రికా రంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు.మృతుడి కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయు) తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్ మాట్లాడుతూ... రాజు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల రవీందర్, సీనియర్ జర్నలిస్టు కొండా లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సిరిసిల్ల అనిల్, తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాకేష్, కార్యదర్శి వేల్పుల రాజు, కరీంనగర్ ఈనాడు యూనిట్ జర్నలిస్టులు, తిమ్మాపూర్, మానకొండూర్ తదితర ప్రాంతాల జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.రాజు మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు అని అన్నారు. మృతుడి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులు అర్పించారు.

Share ePaper Clip

Preparing image...

 – పత్రికా రంగానికి తీరని లోటు…

కరీంనగర్/ మే 01(మా అక్షరం): తిమ్మాపూర్ మండలంలోని ఈనాడు పత్రికకు విలేకరిగా పనిచేస్తున్న బొజ్జ రాజు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఈ సంఘటన పత్రికా రంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు.మృతుడి కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయు) తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్ మాట్లాడుతూ… రాజు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల రవీందర్, సీనియర్ జర్నలిస్టు కొండా లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సిరిసిల్ల అనిల్, తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాకేష్, కార్యదర్శి వేల్పుల రాజు, కరీంనగర్ ఈనాడు యూనిట్ జర్నలిస్టులు, తిమ్మాపూర్, మానకొండూర్ తదితర ప్రాంతాల జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.రాజు మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు అని అన్నారు. మృతుడి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులు అర్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !