+91 99635 77856

లేబర్ కార్డు రెన్యువల్ తప్పనిసరి

Kudikala Sai Editor
maaksharamnews.in

లేబర్ కార్డు రెన్యువల్ తప్పనిసరి

-లేబర్ కార్డు రెన్యువల్ తప్పనిసరి...

-ఉప కార్మిక కమిషనర్ కోల ప్రసాద్...

హుజురాబాద్ /మే06 (మా అక్షరం):కార్మికులు తమ లేబర్ కార్డులను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉప కార్మిక కమిషనర్ కోల ప్రసాద్ సూచించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని స్థానిక హై స్కూల్ క్రీడా మైదానంలో బుధవారం మే డే ఉత్సవాల్లో భాగంగా కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు పొందాలంటే లేబర్ కార్డు చెల్లుబాటు ఉండటం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
లేబర్ కార్డు గడువు ముగిసిన కార్మికులు వెంటనే సంబంధిత కార్యాలయాలను సంప్రదించి పునరుద్ధరణ (రెన్యువల్) ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. రెన్యువల్ చేయించుకోని పక్షంలో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.కార్మికులు తమ సమస్యలను నేరుగా కార్మిక శాఖ అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఇంచార్జ్ కార్మిక శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, మధు, నాయకులు కోయల్కర్ బాలాజీ, సామాజిక కార్యకర్త నలబాల వేణుగోపాల్ తో పాటు వివిధ సంఘాల కార్మిక నేతలు కార్మికులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-లేబర్ కార్డు రెన్యువల్ తప్పనిసరి…

-ఉప కార్మిక కమిషనర్ కోల ప్రసాద్…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !