హుజూరాబాద్/ జూన్ 24 (మా అక్షరం): మహిళల అభివృద్ధే ధ్యేయంగా స్థాపించబడిన మహిళా ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ హుజూరాబాద్ మండల కోఆర్డినేటర్‌గా చెల్పూర్ గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరిని ఎంపిక చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమెకు బాధ్యతలు అప్పగించారు.గత నలభై సంవత్సరాలుగా హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో పేద, వెనుకబడిన మహిళల అభివృద్ధి లక్ష్యంగా ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, లైబ్రరీల నిర్మాణంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల సాధికారతకు కృషి చేస్తోంది. రాష్ట్రంలోని మహిళలు విద్య, వైద్యం, ఆర్థిక, సామాజిక, సేవా రంగాల్లో మరింత పురోగతి సాధించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, శిక్షణ మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మహిళల అభివృద్ధి కోసం చక్కటి వేదికను ఏర్పాటు చేసిన హనుమండ్ల ఝాన్సీ రెడ్డిని వారు అభినందించారు. మహిళల అభ్యున్నతి కోసం కోఆర్డినేటర్లు సేవాభావంతో పనిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా వంతడుపుల కస్తూరి మాట్లాడుతూ, హుజూరాబాద్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో చదువుకుంటున్న ప్రతి అమ్మాయికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. అలాగే మహిళలు అన్ని రంగాల్లో ఎదగడానికి కృషి చేస్తానని, మహిళలకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా నిలుస్తానని చెప్పారు.మండల కోఆర్డినేటర్‌గా ఎంపికైన వంతడుపుల కస్తూరిని మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.













