+91 99635 77856

వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడి

వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడి

-వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడి...

-మహిళతో పాటు విటుడిపై కేసు నమోదు...

హుజురాబాద్/ జూన్ 24 (మా అక్షరం): పట్టణంలోని ప్రతాపవాడలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు బుధవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఓ మహిళ కొంతకాలంగా విటులతో వ్యభిచారం కొనసాగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, ఆమెతో పాటు అక్కడ ఉన్న ఓ విటుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, ప్రతాపవాడలోని ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారణ కావడంతో సంబంధిత మహిళతో పాటు విటుడిపై కేసు నమోదు చేశామని పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.
ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Share ePaper Clip

Preparing image...

-వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడి…

-మహిళతో పాటు విటుడిపై కేసు నమోదు…

హుజురాబాద్/ జూన్ 24 (మా అక్షరం): పట్టణంలోని ప్రతాపవాడలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు బుధవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఓ మహిళ కొంతకాలంగా విటులతో వ్యభిచారం కొనసాగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, ఆమెతో పాటు అక్కడ ఉన్న ఓ విటుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, ప్రతాపవాడలోని ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారణ కావడంతో సంబంధిత మహిళతో పాటు విటుడిపై కేసు నమోదు చేశామని పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.
ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !