+91 99635 77856

తహసీల్దార్ కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం

Kudikala Sai Editor
maaksharamnews.in

తహసీల్దార్ కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం

హుజురాబాద్/ జూన్ 25 (మా అక్షరం): పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం పద్మ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.రాంపూర్ గ్రామానికి చెందిన భూమి వివాదమే ఈ ఘటనకు కారణమని సమాచారం. వారసులు లేని తన బావ కుమారుడు అంబాజీకి చెందిన భూమిని మరో బంధువుల వర్గం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని పద్మ ఆరోపించారు. వారసులు లేని ఆస్తి నలుగురు అన్నదమ్ములకు సమానంగా పంచాలని ఆమె కోరుతున్నారు.ఈ ఘటనపై తహసీల్దార్ నరేందర్ స్పందిస్తూ, "పద్మ ఎవరో తనకు తెలియదని, ఆమె నేరుగా తన ఛాంబర్‌లోకి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించిందని" తెలిపారు.భూమి వివాదం, ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ జూన్ 25 (మా అక్షరం): పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం పద్మ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.రాంపూర్ గ్రామానికి చెందిన భూమి వివాదమే ఈ ఘటనకు కారణమని సమాచారం. వారసులు లేని తన బావ కుమారుడు అంబాజీకి చెందిన భూమిని మరో బంధువుల వర్గం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని పద్మ ఆరోపించారు. వారసులు లేని ఆస్తి నలుగురు అన్నదమ్ములకు సమానంగా పంచాలని ఆమె కోరుతున్నారు.ఈ ఘటనపై తహసీల్దార్ నరేందర్ స్పందిస్తూ, “పద్మ ఎవరో తనకు తెలియదని, ఆమె నేరుగా తన ఛాంబర్‌లోకి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించిందని” తెలిపారు.భూమి వివాదం, ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !