+91 99635 77856

అప్పులు తీర్చేందుకే భూమి అమ్ముతున్నా, దూకిరే అంబాజీ…

Kudikala Sai Editor
maaksharamnews.in

అప్పులు తీర్చేందుకే భూమి అమ్ముతున్నా, దూకిరే అంబాజీ…

-అప్పులు తీర్చేందుకే భూమి అమ్ముతున్నా, దూకిరే అంబాజీ...
-అధికారులను కావాలనే బదనాం చేస్తున్నారు...

హుజురాబాద్/ జూన్ 27 (మా అక్షరం): ఇటీవల హుజురాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ సందర్భంగా జరిగిన మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనలో తమపై, అధికారులపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని భూ విక్రయదారుడు అంబాజీ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు...తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూమిని వ్యక్తిగత అవసరాలు, అప్పులు తీర్చుకునేందుకు విక్రయిస్తున్నానని తెలిపారు. తన భూమిని కాజేసే ఉద్దేశంతోనే రాజ్ కమల్, ఆయన తల్లి పద్మ ఎమ్మార్వో కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం పేరుతో డ్రామా చేశారని ఆరోపించారు. తనకు తోబుట్టువులు ఎవరూ లేరని, భూమిని విక్రయించే హక్కు తనకే ఉందని స్పష్టం చేశారు. గతంలో రాజ్ కమల్ మూడు గుంటల భూమి కొనుగోలు చేస్తానని చెప్పి పాస్‌పుస్తకం తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.భూమి కొనుగోలుదారుడు నానాజీ మాట్లాడుతూ, అంబాజీ నుంచి ఎకరం భూమి కొనుగోలు కోసం ఇప్పటికే రూ.50 లక్షలు చెల్లించామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌కు అంబాజీ అంగీకరించడంతో ఎమ్మార్వో కార్యాలయంలో చలానా కూడా చెల్లించామని తెలిపారు. అయితే రాజ్ కమల్ తన తల్లితో కలిసి వచ్చి ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారని ఆరోపించారు.
ఎమ్మార్వో, ఆర్డీవోలకు సంబంధం లేని విషయంలో లంచాలు తీసుకున్నారని ఆరోపించడం అవాస్తవమని పేర్కొన్నారు. అధికారులకు లంచం ఇవ్వాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. అధికారులను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. భూమి కొనుగోలు వ్యవహారంలో రాజ్ కమల్‌కు ఎలాంటి సంబంధం లేదని, అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దూకిరే

Share ePaper Clip

Preparing image...

-అప్పులు తీర్చేందుకే భూమి అమ్ముతున్నా, దూకిరే అంబాజీ…
-అధికారులను కావాలనే బదనాం చేస్తున్నారు…

హుజురాబాద్/ జూన్ 27 (మా అక్షరం): ఇటీవల హుజురాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ సందర్భంగా జరిగిన మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనలో తమపై, అధికారులపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని భూ విక్రయదారుడు అంబాజీ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు…తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూమిని వ్యక్తిగత అవసరాలు, అప్పులు తీర్చుకునేందుకు విక్రయిస్తున్నానని తెలిపారు. తన భూమిని కాజేసే ఉద్దేశంతోనే రాజ్ కమల్, ఆయన తల్లి పద్మ ఎమ్మార్వో కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం పేరుతో డ్రామా చేశారని ఆరోపించారు. తనకు తోబుట్టువులు ఎవరూ లేరని, భూమిని విక్రయించే హక్కు తనకే ఉందని స్పష్టం చేశారు. గతంలో రాజ్ కమల్ మూడు గుంటల భూమి కొనుగోలు చేస్తానని చెప్పి పాస్‌పుస్తకం తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.భూమి కొనుగోలుదారుడు నానాజీ మాట్లాడుతూ, అంబాజీ నుంచి ఎకరం భూమి కొనుగోలు కోసం ఇప్పటికే రూ.50 లక్షలు చెల్లించామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌కు అంబాజీ అంగీకరించడంతో ఎమ్మార్వో కార్యాలయంలో చలానా కూడా చెల్లించామని తెలిపారు. అయితే రాజ్ కమల్ తన తల్లితో కలిసి వచ్చి ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారని ఆరోపించారు.
ఎమ్మార్వో, ఆర్డీవోలకు సంబంధం లేని విషయంలో లంచాలు తీసుకున్నారని ఆరోపించడం అవాస్తవమని పేర్కొన్నారు. అధికారులకు లంచం ఇవ్వాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. అధికారులను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. భూమి కొనుగోలు వ్యవహారంలో రాజ్ కమల్‌కు ఎలాంటి సంబంధం లేదని, అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దూకిరే

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !