+91 99635 77856

ప్రజల సంక్షేమమే ద్యేయంగా పని చేస్తా

-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…

హుజురాబాద్/జూన్ 29 (మా అక్షరం): నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి, రాజపల్లి, చెల్పూర్, బొత్తలపల్లి, పెద్దపాపయ్యపల్లి, కాట్రపల్లి గ్రామాలతో పాటు హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో సోమవారం లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.అనారోగ్యం, ప్రమాదాలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు CMRF ఆర్ధిక సహాయం వారి గడప వద్దకే చేరేలా చేసి, బాధిత కుటుంబాలకు ధైర్యం నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తాను. ప్రజల విశ్వాసమే నాకు బలం. వారి సేవ చేయడమే నా బాధ్యత, సంక్షేమమే నా లక్ష్యం” అని అన్నారు.ప్రజలకు అవసరమైన ప్రతి సమయంలో అండగా నిలుస్తూ, ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రతి ఇంటి గడపకు చేర్చడంలో నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, అభివృద్ధి–సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ కౌన్సిలర్ గందే శ్రీనివాస్, నాయకులు పోరెడ్డి శంతన్ రెడ్డి, ముత్యంరాజు, తలకొక్కుల ప్రసాద్ శ్యామల, సబ్బని రమేష్,బీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !