హుజురాబాద్/ జూన్ 29(మా అక్షరం): మండలంలోని రాంపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర ఉత్సవాల్లో సోమవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో ఉండాలని, రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు..
Post Views: 261













