+91 99635 77856

విద్యార్థులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

విద్యార్థులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి

హుజురాబాద్/ జూలై 01(మా అక్షరం): విద్యార్థులు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే... రోగాలకు దూరంగా ఉండవచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉడుగుల సురేష్ M D అన్నారు. పట్టణంలోని సూపర్ బజార్ రోడ్ లో గల కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో బుధవారం డాక్టర్ల దినోత్సవ వేడుకలు జరుగగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు మాత్రమే స్వీకరించాలన్నారు. భోజనానికి ముందు, మరుగుదొడ్లను ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మంచినీళ్లను ప్రతిరోజు సమయం అనుగుణంగా క్రమం తప్పకుండా తీసుకోవాలనిసూచించారు. ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్ ను సమయానికి మించి వాడటం ద్వారా కంటి సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయని తెలిపారు. అనంతరం డాక్టర్ ను పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గౌతమ్ రెడ్డి, సంపత్ ,ఉపాధ్యాయులు వాణి శ్రీ,మమత ,మనోజ్,రాజు, పీటర్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ జూలై 01(మా అక్షరం): విద్యార్థులు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే… రోగాలకు దూరంగా ఉండవచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉడుగుల సురేష్ M D అన్నారు. పట్టణంలోని సూపర్ బజార్ రోడ్ లో గల కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో బుధవారం డాక్టర్ల దినోత్సవ వేడుకలు జరుగగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు మాత్రమే స్వీకరించాలన్నారు. భోజనానికి ముందు, మరుగుదొడ్లను ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మంచినీళ్లను ప్రతిరోజు సమయం అనుగుణంగా క్రమం తప్పకుండా తీసుకోవాలనిసూచించారు. ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్ ను సమయానికి మించి వాడటం ద్వారా కంటి సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయని తెలిపారు. అనంతరం డాక్టర్ ను పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గౌతమ్ రెడ్డి, సంపత్ ,ఉపాధ్యాయులు వాణి శ్రీ,మమత ,మనోజ్,రాజు, పీటర్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !