+91 99635 77856

వైద్యులకు విద్యార్ధుల సన్మానం

Kudikala Sai Editor
maaksharamnews.in

వైద్యులకు విద్యార్ధుల సన్మానం

హుజూరాబాద్ /జూన్ 01 (మా అక్షరం): పట్టణంలోని శస్త్ర పబ్లిక్ పాఠశాలలో బుధవారం డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి డ్యూటీ డాక్టర్ యతీషను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మోడెపు శ్రీకర్ ను కూడా ఘనంగా సత్కరించారు. వైద్యుల సేవలు సమాజానికి ఎంతో గొప్పవని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వేణు మాధవ్ మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు. విద్యార్థుల్లో వైద్య వృత్తిపట్ల గౌరవం, సేవాభావం పెంపొందించాలనే ఉద్దేశంతో డాక్టర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న ప్రతి వైద్యుడికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముంజాల సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్ /జూన్ 01 (మా అక్షరం): పట్టణంలోని శస్త్ర పబ్లిక్ పాఠశాలలో బుధవారం డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి డ్యూటీ డాక్టర్ యతీషను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మోడెపు శ్రీకర్ ను కూడా ఘనంగా సత్కరించారు. వైద్యుల సేవలు సమాజానికి ఎంతో గొప్పవని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వేణు మాధవ్ మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు. విద్యార్థుల్లో వైద్య వృత్తిపట్ల గౌరవం, సేవాభావం పెంపొందించాలనే ఉద్దేశంతో డాక్టర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న ప్రతి వైద్యుడికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముంజాల సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !