+91 99635 77856

శాతవాహన ఫలితాల్లో శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

హుజురాబాద్/ జూలై 07 (మా అక్షరం): శాతవాహన విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన డిగ్రీ ద్వితీయ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో హుజురాబాద్‌లోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లు (జీపీఏ) సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చారు.
బీకాం (సీఏ): ఐలబోయిన పూజిత (9.80), జి. వైష్ణవి (8.64), టి. వైష్ణవి (8.44), టి. శ్వేత (8.08) జీపీఏ సాధించారు.
బీఎస్సీ (ఎంపీసీఎస్): మహమ్మద్ సబానాజ్ (9.28), జె. కల్యాణి (7.76), ఎం. మౌనిక (7.28) జీపీఏ సాధించారు.
బీఎస్సీ (బీజెడ్‌సీ): పి. అమృతవర్షిణి (8.68), ఎ. సిరి (8.32), ఎ. అశ్విత (8.12), బి. సాయిప్రణతి (8.08), టి. పావళిక (7.80) జీపీఏతో ఉత్తీర్ణులయ్యారు.
ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే తమ లక్ష్యమని, విద్యార్థుల విజయాలు అధ్యాపకుల అంకితభావానికి నిదర్శనమని తెలిపారు. ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ, అధ్యాపకుల సమిష్టి కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్ అభినందించగా, అధ్యాపకులు కొలిపాక రమేష్, రామరాపు భద్రయ్య, మేకల నవీన్ కుమార్, తెలికుంట్ల వేణు, చందా వెంకటేష్, బోరాగాల సంపత్, వేముల శ్రీనివాస్, సురేష్, స్వప్న, ప్రియాంక, శివాని తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !