+91 99635 77856

కొడుకు లేని లోటు తీర్చిన కూతురు

Kudikala Sai Editor
maaksharamnews.in

కొడుకు లేని లోటు తీర్చిన కూతురు

-తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమార్తె...

హుజురాబాద్/ ఆగస్టు 08 (మా అక్షరం): పట్టణంలోని ప్రతాపవాడ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. క్యాన్సర్ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న అనిత శుక్రవారం మృతి చెందారు. కొడుకు లేని ఆ కుటుంబంలో కుమార్తె తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించి కొడుకు లేని లోటును తీర్చింది.ప్రతాపవాడ కాలనీకి చెందిన గోస్కుల సంపత్, అనిత దంపతులకు సుమారు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి శివాత్మిక, హరిప్రియ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంపత్ తల్లిదండ్రులు సైతం ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా , అనిత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం అద్దె ఇంట్లో మృతి చెందారు. సొంత ఇల్లు లేకపోవడంతో సంపత్, అనిత దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి అద్దె ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు.అనిత మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించగా, అక్కడ కుమార్తె తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Share ePaper Clip

Preparing image...

-తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమార్తె…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !