+91 99635 77856

ప్రధాని చిత్రపటానికి అవమానం.. సీఐకి బీజేపీ ఫిర్యాదు

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రధాని చిత్రపటానికి అవమానం.. సీఐకి బీజేపీ ఫిర్యాదు

హుజూరాబాద్/ ఆగస్టు 07 (మా అక్షరం): పట్టణంలోని  బస్టాండ్‌లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి అనుచిత వ్యాఖ్యలతో కూడిన స్టిక్కర్లు అంటించిన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం హుజూరాబాద్ సీఐకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలు సహజమేనని, అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం లేదా వాటిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంపై స్టిక్కర్లు అంటించడం ద్వారా ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి బాధ్యులను గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టి, హుజూరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్, మంచికట్ల మురళి, మాజీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, గంగిశెట్టి ప్రభాకర్, సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ సభ్యుడు సబ్బని రమేష్, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, గుర్రం సంతోష్, కొలిపాక వెంకటేష్, డోరి ఐలయ్య, దాసరి వీరయ్య, ఠాగూర్ రాజేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !