హుజురాబాద్/ఆగస్టు 14(మా అక్షరం):ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ, మండల ప్రజా పరిషత్ అధికారులు తెలిపారు.ప్రతి సోమవారం ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ప్రజావాణి కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ఆధారాలతో హాజరై వినతిపత్రాలు సమర్పించాలని అధికారులు కోరారు.
Post Views: 38













