+91 99635 77856

ఫిర్యాదు చేసి నెల రోజులు.. సమస్యలు మాత్రం అలాగే!

Kudikala Sai Editor
maaksharamnews.in

ఫిర్యాదు చేసి నెల రోజులు.. సమస్యలు మాత్రం అలాగే!

-హుజురాబాద్ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ప్రమాదకర పరిస్థితులు...

-బస్సుల రాకపోకలకు ఇబ్బందులు.. చర్యలు ఎప్పుడంటున్న ఆర్టీసీ అధికారులు...

హుజురాబాద్/ అక్టోబర్ 01 (మా అక్షరం): ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై ఆర్టీసీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ పరిధిలోని దుకాణాల వద్ద కంకరలు, ఇతర నిర్మాణ సామగ్రి పేరుకుపోవడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గత నెల 25వ తేదీన ఆర్టీసీ డీఎం రవీంద్రనాథ్ మున్సిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.బస్టాండ్ సమీపంలోని షాప్ నంబర్ 1,6 వద్ద కంకరలు, ఇతర సామగ్రి ఉంచడంతో బస్సులు తిరిగే మార్గంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా బస్సులు బస్టాండ్‌లోకి వచ్చి వెళ్లే సమయంలో ఈ సామగ్రి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.అదేవిధంగా బస్టాండ్ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం, మురుగునీరు నిల్వ ఉండటం, విద్యుత్ వైర్లు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లు ఏర్పాటు చేయడం వంటి సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు బస్టాండ్ పరిసరాల్లో మద్యం సేవించడం వల్ల ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.

ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?

బస్సులు రాకపోకలు సాగించే ప్రాంతంలోనే కంకరలు, ఇతర సామగ్రి ఉంచడం, దుకాణాల వద్ద విద్యుత్ వైర్లు, గ్యాస్ స్టవ్‌లు ఏర్పాటు చేయడం వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

నెల రోజులు గడిచినా స్పందన లేదంటున్న అధికారులు సమస్యలపై మున్సిపల్ 
అధికారులకు ఫిర్యాదు చేసి నెల రోజులు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రస్తుత ఆర్టీసీ డీఎం టి. దయాకర్, అసిస్టెంట్ డీఎం దామెర అంజలి పేర్కొంటున్నారు. బస్టాండ్‌లో ప్రయాణికుల భద్రత, బస్సుల సురక్షిత రాకపోకలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో.. బస్టాండ్‌లో ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు మేల్కొంటారా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

Share ePaper Clip

Preparing image...

-హుజురాబాద్ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ప్రమాదకర పరిస్థితులు…

-బస్సుల రాకపోకలకు ఇబ్బందులు.. చర్యలు ఎప్పుడంటున్న ఆర్టీసీ అధికారులు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !