-గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి…
-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,87126 70773…
– సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 99490 51595…
హుజూరాబాద్/ అక్టోబర్ 02 (మా అక్షరం): హుజూరాబాద్ బస్స్టాండ్లో ఆటో చోరీకి పాల్పడి, దొంగిలించిన ఆటోతో పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 28-09-2026న బస్స్టాండ్లో ఆటోను దొంగతనం చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి ఆటోతో పరారైనట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో నిందితుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు.ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తించినా,అతని పేరు, చిరునామా, ఆచూకీ లేదా ఇతర వివరాలు తెలిసినా వెంటనే హుజూరాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.నిందితుడి ఆచూకీ గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిసిన వారు కింది నంబర్లకు ఫోన్ చేయవచ్చు.ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,87126 70773 సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 99490 51595నిందితుడి ఆచూకీకి సంబంధించి సమాచారం ఉన్నవారు ఆలస్యం చేయకుండా పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు.













