హుజురాబాద్ / అక్టోబర్ 04 (మా అక్షరం): పట్టణ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు 11 కేవీ విద్యానగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్ మరమ్మతులు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్న నేపథ్యంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పట్టణ ఏఈ ఎం. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ అంతరాయం కారణంగా విద్యానగర్, గాంధీనగర్, పద్మానగర్, సూపర్ బజార్, సైదాపూర్, కరీంనగర్ రోడ్, వరంగల్ రోడ్ పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.విద్యుత్ లైన్ మరమ్మతులు, కొత్త పోల్స్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరిస్తామని అన్నారు.
Post Views: 208













