+91 99635 77856

హుజురాబాద్‌లో ముమ్మరంగా వాహన తనిఖీలు

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్‌లో ముమ్మరంగా వాహన తనిఖీలు

హుజురాబాద్/ అక్టోబర్ 07 (మా అక్షరం): శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో భాగంగా బుధవారం రాత్రి పట్టణంలో పోలీసులు ముమ్మరంగా నాకాబంది నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలమ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు.ఏసీపీ వాసంశెట్టి మాధవి ఆధ్వర్యంలో, సీఐ టి.కరుణాకర్ నేతృత్వంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. జమ్మికుంట, కరీంనగర్, వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారులపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.వాహనాల పత్రాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచారు.ఈ నాకాబంది కార్యక్రమంలో ఇద్దరు ఎస్‌ఐలు, 15 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, నేరాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఐ టి.కరుణాకర్ తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !