+91 99635 77856

విధుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

Kudikala Sai Editor
maaksharamnews.in

విధుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

-హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే...

హుజురాబాద్/ అక్టోబర్ 31 (మా అక్షరం): ప్రజలకు వైద్య సేవలు అందించే బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్.. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డును సందర్శించి రోగులకు అందుతున్న చికిత్స, వైద్య సదుపాయాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీలో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, అసిస్టెంట్ కలెక్టర్ హరి ప్రసాద్, హుజురాబాద్ ఆర్డీవో జలకుమారి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ హఖీయోద్దీన్ ఖాన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్, తహసీల్దార్ జక్కని నరేందర్, మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, కౌన్సిలర్ కోయల్‌కర్ భారతి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే…

హుజురాబాద్/ అక్టోబర్ 31 (మా అక్షరం): ప్రజలకు వైద్య సేవలు అందించే బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్.. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డును సందర్శించి రోగులకు అందుతున్న చికిత్స, వైద్య సదుపాయాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీలో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, అసిస్టెంట్ కలెక్టర్ హరి ప్రసాద్, హుజురాబాద్ ఆర్డీవో జలకుమారి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ హఖీయోద్దీన్ ఖాన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్, తహసీల్దార్ జక్కని నరేందర్, మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, కౌన్సిలర్ కోయల్‌కర్ భారతి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !