+91 99635 77856

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. 

Kudikala Sai Editor
maaksharamnews.in

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. 

హుజూరాబాద్/నవంబర్ 03(మా అక్షరం):మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఎన్‌హెచ్‌-563 జాతీయ రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.మృతుడి వయస్సు సుమారు 28 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎత్తు సుమారు 5 అడుగుల 7 అంగుళాలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడు బ్లూ చెక్స్ షర్ట్, డార్క్ బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉండగా, మెడలో తాయత్తు ఉన్నట్లు తెలిపారు.అయితే మృతుడి వివరాలు, ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతుడిని గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు హుజూరాబాద్ టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ (8712670773), ఎస్‌ఐ వి. శ్రీనివాసరావు (9908833022)లను సంప్రదించాలని పోలీసులు కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !