+91 99635 77856

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

-ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు..

హుజూరాబాద్ /నవంబర్06 (మా అక్షరం): ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, ఇతర సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్య సేవల కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఆసుపత్రిని సందర్శించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైన నిధులు మంజూరు చేస్తోందన్నారు.ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !