+91 99635 77856

నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి

-కనీసం 50 శాతం ఫిట్‌మెంట్‌తో జూలై 2023 నుంచి వర్తింపజేయాలి...

-పెండింగ్ బకాయిలు చెల్లించాలి.. ఈహెచ్ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి..

-టీఏపీఆర్పీఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ డిమాండ్...

హుజూరాబాద్/ నవంబర్ 06 (మా అక్షరం): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్ శాఖ అధ్యక్షుడు భారత ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్యతో కలిసి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2026 సెప్టెంబర్ నాటికి పీఆర్సీ నివేదిక తెప్పించుకొని నూతన పీఆర్సీ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కనీసం నివేదికను కూడా తెప్పించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఎలాంటి జాప్యం చేయకుండా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకోవాలని, కనీసం 50 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీని ప్రకటించి, జూలై 2023 నుంచి అమలు చేయాలని కోరారు.అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ అమలు కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల నుంచి గత కొన్ని నెలలుగా 1.5 శాతం కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నప్పటికీ, పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి తక్షణమే ఈహెచ్ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నారు.మరోవైపు పదవీ విరమణ పొందిన పెన్షనర్లు తమకు రావాల్సిన పెన్షనరీ బకాయిల కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలను ఏకమొత్తంగా మంజూరు చేసి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చందుపట్ల జనార్ధన్, భారత ప్రభాకర్, చీకట్ల సమ్మయ్య డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

-కనీసం 50 శాతం ఫిట్‌మెంట్‌తో జూలై 2023 నుంచి వర్తింపజేయాలి…

-పెండింగ్ బకాయిలు చెల్లించాలి.. ఈహెచ్ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి..

-టీఏపీఆర్పీఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ డిమాండ్…

హుజూరాబాద్/ నవంబర్ 06 (మా అక్షరం): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్ శాఖ అధ్యక్షుడు భారత ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్యతో కలిసి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2026 సెప్టెంబర్ నాటికి పీఆర్సీ నివేదిక తెప్పించుకొని నూతన పీఆర్సీ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కనీసం నివేదికను కూడా తెప్పించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఎలాంటి జాప్యం చేయకుండా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకోవాలని, కనీసం 50 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీని ప్రకటించి, జూలై 2023 నుంచి అమలు చేయాలని కోరారు.అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ అమలు కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల నుంచి గత కొన్ని నెలలుగా 1.5 శాతం కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నప్పటికీ, పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి తక్షణమే ఈహెచ్ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నారు.మరోవైపు పదవీ విరమణ పొందిన పెన్షనర్లు తమకు రావాల్సిన పెన్షనరీ బకాయిల కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలను ఏకమొత్తంగా మంజూరు చేసి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చందుపట్ల జనార్ధన్, భారత ప్రభాకర్, చీకట్ల సమ్మయ్య డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !