+91 99635 77856

హుజురాబాద్ క్లబ్ ఎన్నికలపై ఉత్కంఠ

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్ క్లబ్ ఎన్నికలపై ఉత్కంఠ

-ప్రచారంలో రెండు వర్గాల వ్యూహాలు.. ఓటర్ల తీర్పుపై ఆసక్తి!...

-ఒకవైపు నిరాడంబర ప్రచారం.. మరోవైపు విందులు, వినోదాలతో హడావుడి...

-కెప్టెన్, ప్రణవ్ మద్దతు ఎవరికో? నేడే పోలింగ్.. నేడే ఫలితాలు!...

హుజురాబాద్/ నవంబర్ 15 (మా అక్షరం):హుజురాబాద్ క్లబ్ ఎన్నికల పోరు ఉత్కంఠభరితంగా మారింది. గత కొద్దిరోజులుగా రెండు ప్యానళ్ల మధ్య సాగుతున్న ప్రచారం తారస్థాయికి చేరుకోవడంతో పట్టణంలో ఎక్కడ చూసినా క్లబ్ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఒకవైపు అభ్యర్థులు సభ్యులను వ్యక్తిగతంగా కలిసి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా.. మరోవైపు విందులు, వినోదాలు, ఆర్భాటాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంకోవైపు నిరాడంబరంగా సభ్యులను కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగించారు. దీంతో ఈసారి క్లబ్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు..

హుజురాబాద్ క్లబ్ పునరుద్ధరణ అనంతరం ఇప్పటివరకు ఎన్నికలు ఏకగ్రీవంగానే జరగగా, ఈసారి మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. రెండు ప్యానళ్లు బరిలో నిలవడంతో పోటీ అనివార్యమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులతో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా కీలక పదవుల కోసం జరుగుతున్న పోరు ఎన్నికల వేడిని మరింత పెంచింది.

కెప్టెన్, ప్రణవ్ మద్దతుపై ఉత్కంఠ..

క్లబ్ గౌరవాధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కాంగ్రెస్ యువ నాయకుడు వొడితల ప్రణవ్ బాబు మద్దతు ఎవరికి ఉంటుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రెండు వర్గాలు తమకు పెద్దల మద్దతు ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వారి మద్దతుపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామాలు ఎన్నికల వాతావరణంలో ఆసక్తిని మరింత పెంచాయి.

పదవుల కోసం పోరా.. సేవల కోసం పోరా?...

ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏ ప్యానల్ పైచేయి సాధిస్తుంది? అన్న చర్చలే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్లబ్ అభివృద్ధికి కొత్త పాలకవర్గం ఏం చేయబోతోందన్నది అసలు ప్రశ్నగా మారింది. క్లబ్ ఆదాయ, వ్యయాలపై పారదర్శకత పాటిస్తారా? ఫంక్షన్ హాల్ లీజు, బార్ నిర్వహణకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారా? సభ్యులందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తారా? అన్న అంశాలపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది.

కొత్త కమిటీ ముందు కీలక సవాళ్లు...

క్లబ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్టు, జిమ్, లైబ్రరీ, టెన్నిస్ కోర్టు, ఫంక్షన్ హాల్ వంటి సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సుమారు 350 మంది సభ్యులున్న క్లబ్ నిర్వహణలో ఆర్థిక పారదర్శకత, సభ్యుల సంక్షేమం, సౌకర్యాల మెరుగుదల, క్రీడల ప్రోత్సాహానికి కొత్త పాలకవర్గం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ప్రచారానికే పరిమితం కాకుండా ఆచరణలోకి రావాలని సభ్యులు కోరుకుంటున్నారు.

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్..

హుజురాబాద్ క్లబ్ ఎన్నికల పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో అభ్యర్థులు, వారి అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తి

నేడు జరగనున్న పోలింగ్‌లో సభ్యులు ఎవరికి పట్టం కడతారు? ప్రచార ఆర్భాటాలకు ఆకర్షితులవుతారా? లేక క్లబ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే అభ్యర్థులను ఎన్నుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రచారంలో కనిపించిన హడావుడి ఓట్ల రూపంలో ఎంతవరకు ప్రతిబింబిస్తుందో మధ్యాహ్నం వెలువడనున్న ఫలితాలతో తేలిపోనుంది. ఏ ప్యానల్ విజయం సాధిస్తుంది? ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతోంది? అన్నది మరికొద్ది గంటల్లో స్పష్టంకానుంది.పదవులు దక్కించుకోవడం విజయం కావచ్చు.. కానీ సభ్యుల మనసులు గెలుచుకొని క్లబ్‌ను అభివృద్ధి పథంలో నడిపించడమే అసలైన నాయకత్వానికి నిదర్శనం!

Share ePaper Clip

Preparing image...

-ప్రచారంలో రెండు వర్గాల వ్యూహాలు.. ఓటర్ల తీర్పుపై ఆసక్తి!…

-ఒకవైపు నిరాడంబర ప్రచారం.. మరోవైపు విందులు, వినోదాలతో హడావుడి…

-కెప్టెన్, ప్రణవ్ మద్దతు ఎవరికో? నేడే పోలింగ్.. నేడే ఫలితాలు!…

హుజురాబాద్/ నవంబర్ 15 (మా అక్షరం):హుజురాబాద్ క్లబ్ ఎన్నికల పోరు ఉత్కంఠభరితంగా మారింది. గత కొద్దిరోజులుగా రెండు ప్యానళ్ల మధ్య సాగుతున్న ప్రచారం తారస్థాయికి చేరుకోవడంతో పట్టణంలో ఎక్కడ చూసినా క్లబ్ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఒకవైపు అభ్యర్థులు సభ్యులను వ్యక్తిగతంగా కలిసి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా.. మరోవైపు విందులు, వినోదాలు, ఆర్భాటాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంకోవైపు నిరాడంబరంగా సభ్యులను కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగించారు. దీంతో ఈసారి క్లబ్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు..

హుజురాబాద్ క్లబ్ పునరుద్ధరణ అనంతరం ఇప్పటివరకు ఎన్నికలు ఏకగ్రీవంగానే జరగగా, ఈసారి మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. రెండు ప్యానళ్లు బరిలో నిలవడంతో పోటీ అనివార్యమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులతో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా కీలక పదవుల కోసం జరుగుతున్న పోరు ఎన్నికల వేడిని మరింత పెంచింది.

కెప్టెన్, ప్రణవ్ మద్దతుపై ఉత్కంఠ..

క్లబ్ గౌరవాధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కాంగ్రెస్ యువ నాయకుడు వొడితల ప్రణవ్ బాబు మద్దతు ఎవరికి ఉంటుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రెండు వర్గాలు తమకు పెద్దల మద్దతు ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వారి మద్దతుపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామాలు ఎన్నికల వాతావరణంలో ఆసక్తిని మరింత పెంచాయి.

పదవుల కోసం పోరా.. సేవల కోసం పోరా?…

ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏ ప్యానల్ పైచేయి సాధిస్తుంది? అన్న చర్చలే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్లబ్ అభివృద్ధికి కొత్త పాలకవర్గం ఏం చేయబోతోందన్నది అసలు ప్రశ్నగా మారింది. క్లబ్ ఆదాయ, వ్యయాలపై పారదర్శకత పాటిస్తారా? ఫంక్షన్ హాల్ లీజు, బార్ నిర్వహణకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారా? సభ్యులందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తారా? అన్న అంశాలపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది.

కొత్త కమిటీ ముందు కీలక సవాళ్లు…

క్లబ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్టు, జిమ్, లైబ్రరీ, టెన్నిస్ కోర్టు, ఫంక్షన్ హాల్ వంటి సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సుమారు 350 మంది సభ్యులున్న క్లబ్ నిర్వహణలో ఆర్థిక పారదర్శకత, సభ్యుల సంక్షేమం, సౌకర్యాల మెరుగుదల, క్రీడల ప్రోత్సాహానికి కొత్త పాలకవర్గం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ప్రచారానికే పరిమితం కాకుండా ఆచరణలోకి రావాలని సభ్యులు కోరుకుంటున్నారు.

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్..

హుజురాబాద్ క్లబ్ ఎన్నికల పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో అభ్యర్థులు, వారి అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తి

నేడు జరగనున్న పోలింగ్‌లో సభ్యులు ఎవరికి పట్టం కడతారు? ప్రచార ఆర్భాటాలకు ఆకర్షితులవుతారా? లేక క్లబ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే అభ్యర్థులను ఎన్నుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రచారంలో కనిపించిన హడావుడి ఓట్ల రూపంలో ఎంతవరకు ప్రతిబింబిస్తుందో మధ్యాహ్నం వెలువడనున్న ఫలితాలతో తేలిపోనుంది. ఏ ప్యానల్ విజయం సాధిస్తుంది? ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతోంది? అన్నది మరికొద్ది గంటల్లో స్పష్టంకానుంది.పదవులు దక్కించుకోవడం విజయం కావచ్చు.. కానీ సభ్యుల మనసులు గెలుచుకొని క్లబ్‌ను అభివృద్ధి పథంలో నడిపించడమే అసలైన నాయకత్వానికి నిదర్శనం!

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !