– మండల గ్రామీణ లబ్ధిదారులకు మధ్యాహ్నం 3 గంటలకు..
– పట్టణ లబ్ధిదారులకు సాయంత్రం 4 గంటలకు..
– ప్రతాప సాయిరెడ్డి గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమం…
హుజురాబాద్/నవంబరు 15 (మా అక్షరం): మండలంతో పాటు పట్టణ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మధ్యాహ్నం 3 గంటలకు జమ్మికుంట రోడ్డులోని ప్రతాప సాయిరెడ్డి గార్డెన్స్‌లో పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.అదేవిధంగా హుజురాబాద్ పట్టణ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు సాయంత్రం 4 గంటలకు ఇదే వేదికపై మంజూరు ఉత్తర్వులను అందజేయనున్నారు.ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు.అర్హులైన లబ్ధిదారులు తమకు కేటాయించిన సమయానికి కార్యక్రమానికి హాజరై పెన్షన్ మంజూరు ఉత్తర్వులను స్వీకరించాలని అధికారులు కోరారు.













