-ముగిసిన పోలింగ్.. మరికొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు!..
– మొత్తం 326 ఓట్లకు గాను 308 ఓట్లు నమోదు..
– మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం…
– మరో రెండు గంటల్లో వెలువడనున్న ఫలితాలు…
– గెలుపెవరిది? ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!…
హుజురాబాద్ / నవంబర్ 15 (మా అక్షరం): హుజురాబాద్ క్లబ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 326 ఓట్లకు గాను 308 ఓట్లు పోలయ్యాయి. దీంతో 94.48 శాతం పోలింగ్ నమోదైంది.ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపైనే పడింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సుమారు రెండు గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉండటంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన హుజురాబాద్ క్లబ్ వాతావరణం, పోలింగ్ ముగియడంతో ఫలితాల ఉత్కంఠతో మరింత వేడెక్కింది. అధిక శాతం పోలింగ్ నమోదు కావడంతో అభ్యర్థుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. చివరకు ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? విజయం ఎవరిని వరిస్తుంది? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.













