+91 99635 77856

కెప్టెన్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి!

Kudikala Sai Editor
maaksharamnews.in

కెప్టెన్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి!

-క్లబ్ ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించిన ప్రముఖులు.. అభ్యర్థులకు శుభాకాంక్షలు...

హుజూరాబాద్ / నవంబర్ 15 (మా అక్షరం):హుజూరాబాద్ క్లబ్ ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం హుజూరాబాద్ క్లబ్‌లో మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు, ఇంద్రనీల్ తదితరులు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కెప్టెన్ లక్ష్మీకాంత రావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించిన వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, భవిష్యత్తు ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ప్రతి సభ్యుడు తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.ఎన్నికల్లో వివిధ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విజయం సాధించిన వారు క్లబ్ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. హుజూరాబాద్ క్లబ్ ఎన్నికలు స్నేహపూర్వక వాతావరణంలో, ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Share ePaper Clip

Preparing image...

-క్లబ్ ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించిన ప్రముఖులు.. అభ్యర్థులకు శుభాకాంక్షలు…

హుజూరాబాద్ / నవంబర్ 15 (మా అక్షరం):హుజూరాబాద్ క్లబ్ ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం హుజూరాబాద్ క్లబ్‌లో మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు, ఇంద్రనీల్ తదితరులు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కెప్టెన్ లక్ష్మీకాంత రావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించిన వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, భవిష్యత్తు ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ప్రతి సభ్యుడు తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.ఎన్నికల్లో వివిధ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విజయం సాధించిన వారు క్లబ్ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. హుజూరాబాద్ క్లబ్ ఎన్నికలు స్నేహపూర్వక వాతావరణంలో, ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !