-కాంగ్రెస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు యేముల పుష్పలత…
హుజురాబాద్/ సెప్టెంబర్12(మా అక్షరం): ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి వస్తే చీర, గాజులతో స్వాగతం పలుకుతామని హుజరాబాద్ కాంగ్రెస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు యేముల పుష్పలత అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… మహిళలను అగౌరపరిచేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అదే మహిళల దగ్గరికి వెళ్లి తన భార్యతో కొంగు చాచి ఓట్లు అడిగిన సంగతి మర్చిపోయారా అంటూ ఎద్దేవ చేశారు. కౌశిక్ రెడ్డికి మహిళల పట్ల గౌరవం ఉండదని గతంలో కూడా సొంత పార్టీ వారితోపాటు గవర్నర్ ను కూడా కించపరిచేలా మాట్లాడారని అన్నారు. తనకు రాజకీయ ఓనమాలు నేర్పింది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కాంగ్రెస్ నుంచి బి ఆర్ ఎస్ లోకి వెళ్లినప్పుడు చీర, గాజులు గుర్తుకు రాలేదా అని అన్నారు. అనంతరం కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీ కి చీర గాజులు చుట్టి మినత్న ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాళ్ళు మండల అధ్యక్షురాలు లావణ్య,జమ్మికుంట మండల అధ్యక్షురాలు పూదరి రేణుక,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుశీల,పుల్ల రాధ,బుర్ర రేణుక,మల్లీశ్వరి,సునీత,స్వరూప,తిరుమల,ఖరీమా,మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











