+91 99635 77856

నేటి నుండి జోనల్ క్రీడలు ప్రారంభం..

– పదవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ..

కరీంనగర్, మానకొండూరు/ నవంబర్ 11(మా అక్షరం): మండలంలోని దేవంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో పదవ జోనల్ స్థాయి క్రీడా పోటీలను సోమవారం నిర్వహించారు.కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 14 గురుకుల పాఠశాలలకు చెందిన 1190 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరవగా విద్యార్థులు యోగాసనాలతో, నృత్యాలతో స్వాగతం పలికాగా గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పూలబొకేలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఒలంపిక్ జ్యోతిని వెలిగించి ఎమ్మెల్యే కవ్వంపల్లి క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ…. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలను 20 జోన్లుగా విభజించి బాల బాలికలకు వేరువేరుగా క్రీడా పోటీలు నిర్వహిస్తుందని, ఈ స్పోర్ట్స్ మీట్ ఆటలు శారీరక దృఢత్వాన్ని, జట్టుకృషిని, సహకారాన్ని ప్రోత్సహిస్తాయని, విద్యార్థులలో ఐక్యత భావాన్ని నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తుందని తెలిపారు.ఈమధ్య 140 కోట్ల జనాభా కలిగిన చిన్న దేశమైన ప్యారిస్ లో ఒలంపిక్స్ ఆటలు జరిగాయని ఇందులో 40వరకు బంగారు పథకాలు సాధించారని అలాంటిది జనాభాలో పెద్దదైన మన దేశంలో ఎన్ని గోల్డ్ మెడల్స్ పొందగలమో ఒకసారి ఆలోచించాలన్నారు. విద్యార్థి దశలోనే క్రీడా ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడల పట్ల తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. 30 ఏళ్ల తర్వాత యోగ సాధనలో బంగారు పతకాన్ని పొందగలిగామని ఇది గురుకుల పాఠశాలకు ఒక గొప్ప విషయమని కొనియాడారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం మానసిక స్థితి చురుకుగా ఉంటుందని, విద్యార్థుల్లో క్రీడలు స్ఫూర్తిని నింపి, స్నేహభావం పెంపొందిస్తాయని, విద్యార్థులు గెలుపోటములను ఒకే విధంగా స్వీకరించి ముందుకు సాగుతూ చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణిస్తూ గురుకుల ఖ్యాతిని ప్రపంచానికి చాటి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు.ఈ సందర్భంగా జాతీయస్థాయి యోగా పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన మానకొండూరుకు చెందిన గురుకుల విద్యార్థి మాస్టర్ దీపక్ ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టిజిఎస్డబ్యుఆర్ సంస్థ జాయింట్ సెక్రెటరీ అనంతలక్ష్మి, తాసిల్దార్ రాజేశ్వరి, మండల విద్యాధికారి మధుసూదనా చారి, ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు, లచ్చయ్య, శ్రీకాళహస్తి, అశోక్ బాబు, కే వాసు, పాఠశాల ఇన్చార్జులు పీ ఇనాక్, బాలసుందర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జె ప్రవీణ్, శివ, శేఖర్, విక్రమ్,దేవంపల్లి పేరెంట్స్ రేణిగుంట బాబు, సూపర్ సీనియర్ స్వేరో మొగురం రమేష్, ప్రవీణ్ దాసరపు సంపత్, సవిత, శ్రీనివాస్, సతీష్, వివిధ పాఠశాల పిఈటీలు, హెల్త్ సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !