+91 99635 77856

వామ్మో కోతులు…

Kudikala Sai Editor
maaksharamnews.in

వామ్మో కోతులు…

-ఇంట్లో నుంచి బయటికి రావాలంటే జింకుతున్న పట్టణవాసులు..
-కోతుల బెడద నివారించాలంటూ ప్రజల విన్నపం..
హుజురాబాద్ /నవంబర్ 14 ( మా అక్షరం ): ఒకప్పుడు కోతులను చూడాలంటే అడవికి వెళ్లాల్సి వచ్చేది. కోతి కనిపించడంతో సంబరమాశ్చర్యాలకు గురయ్యేవారు.

అలాంటిది ఇప్పుడు హుజురాబాద్ లో కోతులను చూడగానే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. కోతులు తారసపడ్డ వెంటనే పరుగులు పెడుతున్నారు. హుజురాబాద్ పట్టణంలోని పలు కాలనీలలో విచ్చలవిడిగా కోతులు గుంపులుగా రోడ్లపై, ఇళ్ల మీదికి రావడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.కోతుల ద్వారా మాకు జరిగే నష్టాన్ని ఇబ్బందులను మున్సిపల్ పాలకవర్గం కోతులపై దృష్టి పెట్టి కోతుల బెడద నుంచి హుజురాబాద్ పట్టణాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.గతంలో గుట్టలకు మాత్రమే కనపడే కోతులు గుట్టలను తోలవడంతో బాంబుల శబ్దానికి భయానికి గురై పట్టణాలకు, పల్లెలకు వస్తున్నాయి. అంతేకాకుండా గుట్టలకు వాటికి కావలసినటువంటి పండ్ల చెట్లు లేకపోవడంతో ఆహార ఇబ్బందులకు గురై పట్టణాల బాట పడుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం మున్సిపల్ పాలకవర్గం కోతులను పట్టే వారితో పట్టణంలోని పలుచోట్ల కోతులను పట్టించి అడవిలో వదిలిపెట్టించారు. దాని తర్వాత కొన్ని రోజులపాటు కోతుల బెడద తగ్గింది. కానీ మళ్ళీ రెండు మూడు నెలలుగా పట్టణంలో ఎక్కడ చూసినా కోతుల గుంపుల బెడద తప్పడం లేదు. ఇంట్లో నుంచి రోడ్లపైకి వెళ్లాలంటే ఎక్కడ కోతుల గుంపు ఉంటుందో అర్థం కాక భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా పురాతన గూన పెంకుట ఇండ్లు ఉన్న వాళ్ళ పరిస్థితి మరి గోరంగా తయారయింది. వారింటిపై కోతుల గుంపులు చేరి వారి ఇంటి కప్పులను తీసి పారేయడంతోపాటు ఇళ్లలోకి చొరబడి వారి యొక్క వంట సామాగ్రిని తీసుకువెళ్లడంతో పాటు మనుషులను గాయపరచడం కూడా జరుగుతుంది. కవర్ చేతిలో కనబడితే చాలు ఇక అంతే సంగతులు ఆ వ్యక్తిని బెదిరించి మరి గాయపరిచి కవర్ని లాక్కెళ్తున్నాయి. కోతులు బెదిరించడంతో అదుపుతప్పి ప్రమాదాలు జరిగి కాలు విరిగిన వాళ్ళు సైతం ఉన్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలోని కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాల్సిందిగా కోరుతున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !