+91 99635 77856

జాతీయ సేవా పథకంలో భాగంగా పశు వైద్య శిబిరాలు

కరీంనగర్, తిమ్మాపూర్ డిసెంబర్ 02 (మా అక్షరం):తిమ్మాపూర్ మండలకేంద్రంతో పాటు పొరండ్ల, మొగిలిపాలెం గ్రామాలలో పశుసంవర్ధక శాఖ జాతీయ సేవా పథకంలో భాగంగా పివి నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం కోరుట్ల పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక పశువైద్య శిబిరాలను నిర్వహించారు.ఈ శిబిరంలో 95 జంతువులకు గర్భ పరీక్షలు, గర్భాశయ వ్యాధుల చికిత్స, 270 మెడిసిన్ కేసులు, 6 జంతువులకు శస్త్ర చికిత్సలు, పాథాలజీ విభాగం వైద్యులు వై.రవికుమార్ ఆధ్వర్యంలో బ్లడ్ స్మియర్ పరీక్షలు, రక్త సంబంధిత వ్యాధులు, ఇతర పరాన్నజీవుల పరీక్షలు నిర్వహించి పశు పోషణలో ఖనిజ లవణ మిశ్రమం యొక్క ప్రాముఖ్యతను, ప్రాథమిక పాఠశాల పిల్లలకు జూనోటిక్ వ్యాధులపై అవగాహన కల్పించి, పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ పశువులలో ప్రబలుతున్న వివిధ వ్యాధులు, వాటి నివారణ చర్యలు, కొత్త నివారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి ఖనిజ మిశ్రమంతో పాటు హైబ్రిడ్ నేపియర్ సిఓ-1 రకం గడ్డి స్లిప్‌లను పంపిణీ చేశారు. రైతుల నుంచి స్పందన రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలోఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సాకారం, డాక్టర్ జి.అంబిక, డాక్టర్ ఎం.శ్రీనివాస్ తోపాటు అధ్యాపకులు 71 మంది విద్యార్థులు, పశుసంవర్థక శాఖ వైద్యులు డాక్టర్ మోనికా, డాక్టర్ భారతి, డాక్టర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !