+91 99635 77856

కష్టపడ్డొళ్లకు అవకాశాలు కల్పిస్తా

– నమ్ముకున్నోళ్లకు వెన్నంటి ఉంటా…

– కొత్త,పాత తారమత్యాలొద్దు…

– కలిమితోనే బలిమి…

– కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఉద్భోద…

కరీంనగర్, తిమ్మాపూర్/ జనవరి 10 (మా అక్షరం):

కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశాలు కల్పిస్తానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అద్యక్షుడు, మానకొండూ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు.
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్ లో మండల పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ మానకొండూర్ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం అప్పటి అధికార పార్టీ ఆగడాలు, దాడులు, నిర్బంధాలను తట్టుకొని పని చేసిన నాయకులు, కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్నారు.గత ఎన్నికల్లో కష్టపడ్డోళ్లకు, నమ్ముకొని నమ్మకంగా ఉన్నోళ్ల వెన్నంటి ఉంటానన్నారు. అలాంటి వారికే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగా పార్టీలో చేరిన వారు కూడా తన గెలుపు కోసం శ్రమించారన్నారు. పార్టీలో అందరూ సమావమేనని, కొత, పాత తారతమ్యాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. అందరూ కలిసి మెలిసి పని చేసినప్పుడు పార్టీ మరింత పటిష్టమవుతుందని ఆయన ఉద్భోదించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలోనే అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, ఆరు గ్యారెంటీల్లో అమలైన పథకాలను, సంక్రాంతి నుంచి అమలు కానున్న పథకాల గురించి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గాని, సంక్షేమ పథకాల గురించి కాని ప్రజలకు చెప్పుకోకపోవడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రగతి పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీశ్రేణులదేనని ఆయన గుర్తు చేశారు.
ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణగౌడ్, కాంగ్రెస్ ఉన్న పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, కుంట రవీందర్ రెడ్డి, గోగూరి నర్సింహారెడ్డి, గవ్వ రాజేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, మామిడి అనిల్, బుడిగె కొండయ్య, పోలు రమేశ్,పోలు రాము,,ఎస్.కొండల్ రావు, నోముల అనిల్, కొత్త తిరుపతిరెడ్డి, బండారి రమేశ్, రెడ్డిగాని రాజు, బుదారపు శ్రీనివాస్, చెన్నబోయిన రవి, కొత్త రాజిరెడ్డి, కాల్వ మల్లయ్య, టి.రమేశ్, అట్ల అనిల్ కుమార్, కర్ర మణికంఠ, గొట్టెముక్కుల సంపత్, ఎండీ హసన్, తాజుద్దీన్, ఆశిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !