+91 99635 77856

తెలంగాణ ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు

Kudikala Sai Editor
maaksharamnews.in

తెలంగాణ ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు

హైదరాబాద్/జనవరి11(మా అక్షరం): తెలంగాణ రాష్ట్రం లోని చేనేత సహకార కార్మికుల సంక్షేమం కోసం శుక్రవారం విడుదల చేసిన జీవో ప్రకారం ఫిబ్రవరి నెల నుంచి అమలు కాబోతున్న సంక్షేమ పథకాలను స్వాగతిస్తూ శనివారం తెలంగాణ చేనేత ఐక్యవేదిక వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రం లో జియో టాగ్ విధానం లో ఉన్న 38 వేల మగ్గాల చేనేత కార్మికులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నదని,జియో టాగ్ విధానం లో లేని మగ్గాలు రాష్ట్రం లో ఇంకా సుమారు ఇరవై అయిదు వేల పైననే ఉన్నాయని కాబట్టి ప్రభుత్వం దయచేసి గమనించగలరని అన్నారు.జియో టాగ్ విధానం లేని మాగ్గాల వారికి కూడా వెంటనే నంబరింగ్ ఇవ్వాలని,వారికి కూడా ప్రభుత్వ పథకాలు అమలు జరిగే విధంగా చేయాలని కోరారు.జియో టాగ్ విధానం వలన చేనేత కార్మికులు గత పది సంవత్సరాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ విధానం భారత దేశంలో ఏ రాష్ట్రం లో కూడా లేదనిఇలాంటి వ్యవస్థ సరియైన పద్ధతిలో అధికారులు అమలు చేయక పోవడం వలన వేల మందిచేనేత కార్మికులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు.మగ్గం కలిగి ఉన్న ప్రతి నేత కుటుంబానికి అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలు అందాలని కోరుచున్నామన్నారు.

Share ePaper Clip

Preparing image...

హైదరాబాద్/జనవరి11(మా అక్షరం): తెలంగాణ రాష్ట్రం లోని చేనేత సహకార కార్మికుల సంక్షేమం కోసం శుక్రవారం విడుదల చేసిన జీవో ప్రకారం ఫిబ్రవరి నెల నుంచి అమలు కాబోతున్న సంక్షేమ పథకాలను స్వాగతిస్తూ శనివారం తెలంగాణ చేనేత ఐక్యవేదిక వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రం లో జియో టాగ్ విధానం లో ఉన్న 38 వేల మగ్గాల చేనేత కార్మికులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నదని,జియో టాగ్ విధానం లో లేని మగ్గాలు రాష్ట్రం లో ఇంకా సుమారు ఇరవై అయిదు వేల పైననే ఉన్నాయని కాబట్టి ప్రభుత్వం దయచేసి గమనించగలరని అన్నారు.జియో టాగ్ విధానం లేని మాగ్గాల వారికి కూడా వెంటనే నంబరింగ్ ఇవ్వాలని,వారికి కూడా ప్రభుత్వ పథకాలు అమలు జరిగే విధంగా చేయాలని కోరారు.జియో టాగ్ విధానం వలన చేనేత కార్మికులు గత పది సంవత్సరాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ విధానం భారత దేశంలో ఏ రాష్ట్రం లో కూడా లేదనిఇలాంటి వ్యవస్థ సరియైన పద్ధతిలో అధికారులు అమలు చేయక పోవడం వలన వేల మందిచేనేత కార్మికులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు.మగ్గం కలిగి ఉన్న ప్రతి నేత కుటుంబానికి అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలు అందాలని కోరుచున్నామన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !