+91 99635 77856

సీఎం చిత్రపటానికి చేనేత కార్మికుల పాలభిషేకం

హుజురాబాద్/జనవరి11(మా అక్షరం): పట్టణంలోని చేనేత సంఘం ఆవరణలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు చేనేత కార్మికులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం చేనేత పరిశ్రమలోని చేనేత పారిశ్రామికుల సంక్షేమం ఆర్థికాభివృద్ధికి చేనేత అభయ హస్తం లో భాగంగా ‘నేతన్న పొదుపు’ త్రిప్టుఫండ్ పథకం, ‘నేతన్న భద్రత, వయస్సుతో నిమిత్తం లేకుండా బీమా మరియు ఎక్స్గ్రేషియా పథకం ‘నేతన్న భరోసా’ నేత పారిశ్రామికునికి అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూర్చే పథకాలు ఫిబ్రవరి నుండి అమలు చేస్తున్నందుకుగాను వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు ఎలిగేటి ఉపేందర్ పర్సన్ ఇంచార్జి, వేముల యాదగిరి,గుండేటి మహాదేవ్, మంచికట్ల వెంకటయ్య,మండల సత్యనారాయణ, కుడికాల ప్రభాకర్, మంచికట్ల సుమలత,మంచి కట్ల వాణి పర్సన్స్ ఇన్చార్జి సంఘం నేత పారిశ్రామికులు, బాపూజీ నేత పారిశ్రామికులు, సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !