-ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…
హుజూరాబాద్ /సెప్టెంబర్ 04(మా అక్షరం):
పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ముందస్తుగా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా జరపడం జరిగిందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ .నరేందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక ప్రత్యేక రోజు అని, ఇది గురువుల గొప్పతనాన్ని మనస్పూర్తిగా గుర్తించి విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వాన్ని అందించే రోజు అని, విద్యలో నైపుణ్యాలను పెంపొందించే గురువులు మన సమాజంలో అత్యంత గౌరవం పొందుతున్నారని తెలియజేశారు. తదనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ… ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా నేను పాల్గొన్నందుకు గర్వంగా ఉందనీ, గురువులు మన సమాజ నిర్మాణానికి స్కూల్లో మొదటి మెట్టు, విద్యారంగంలో అత్యంత మౌలికమైన పాత్ర పోషిస్తున్నారని, ఉపాధ్యాయుల సాకారం మరియు వారి త్యాగాన్ని గుర్తిస్తూ, వారి అంకురార్పణం వల్ల యువత సరికొత్త శక్తితో సమాజంలో ఎదుగుదలకు దారితీస్తారని తెలియజేసారు. తదనంతరం నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు అందరిని అలరించాయి. తదనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, అదేవిధంగా ప్రతి ఒక్క టీచర్ కి మొక్కలను అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.











