-వైభవంగా నిమజ్జన వేడుకలు…
-కన్నుల పండుగలా…శోభాయాత్రలు..
హుజురాబాద్/ సెప్టెంబర్ 05(మా అక్షరం ):
జై గణేశా..జై జై గణేశా.. బై బై గణేశా … గణపతి బప్పామోర్యా.. నినాదాలు మిన్నంటగా యువకులనృత్యాలు, చిన్నారుల ఆటపాటలు, ఆడపడుచుల కోలాటాలు డప్పు చప్పుళ్ల నడుమ శుక్రవారం గణనాథుడికి వీడ్కోలు పలికారు. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగిన శోభాయాత్రకు ప్రజలు అడుగడుగునా గణపయ్యకు నీరా“జనం” పలికారు. తొమ్మిది రోజుల పాటు ధూప దీప నైవేద్యాలతో ఆరాధించిన గౌరిసుతుడిని గంగమ్మ ఒడికి చేర్చి..‘గణపయ్యా పోయిరావయ్యా…’ సాగనంపి వీడ్కోలు,పలికారు.
నిమజ్జన ప్రాంతాల వద్ద భారీ ఏర్పాట్లు….
పట్టణ శివారులోని కొత్తపల్లి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లను నిర్వహించింది. భక్తులకు ఏలాంటి ఇబ్బందుకుల కలుగకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నారు. విగ్రహా నిమజ్జనపు ప్రాంతాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఆరోగ్యశాఖ పటిష్ట చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ వాసంశెట్టి. మాధవి,టౌన్ సిఐ కరుణాకర్, హుజురాబాద్ రూరల్ సీఐ పులి.వెంకట్,మున్సిపల్ కమిషనర్ కేంసారపు. సమ్మయ్య, మున్సిపల్ మేనేజర్ రావుల. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ వివిధ శాఖల అధికారులు కళాకారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విఘ్నేశ్వరుని నిమజ్జనానికి తీసుకు వెళ్తున్న చిన్నారులు…














