-బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలని బంద్..
– బస్ డిపోలో నిలిచిపోయిన బస్సులు..
-ప్రజలకు తీవ్ర ఇబ్బందులు…
హుజూరాబాద్/ అక్టోబర్ 18(మా అక్షరం):బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, నాయకులు పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో హుజూరాబాద్‌లో తెల్లవారుజామున నుంచే బీసీ నాయకులు బస్ డిపో ముందు కూర్చొని ధర్నా చేశారు. దీంతో బస్సులు డిపో నుండి బయటకు రాకుండా ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అంతేకాకుండా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహన రాకపోకలు తగ్గిపోయాయి. బంద్‌కు బీసీ సంఘాలు, నాయకులు, యువత విస్తృత మద్దతు తెలిపారు.బంద్ సందర్భంగా బీసీ నాయకులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో యువకులు పాల్గొని నినాదాలతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో సంచరించారు.బంద్ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిసి నాయకులు మాట్లాడుతూ… బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, డిమాండ్లు నెరవేర్చేవరకు పోరాటం కొనసాగుతుంది అని హెచ్చరించారు.











