+91 99635 77856

దుఃఖాన్ని తొలగించేది నిజమైన క్రిస్మస్
-పాస్టర్ నాగేశెట్టి డానియల్…
హుజురాబాద్/ డిసెంబర్ 25 (మా అక్షరం): పట్టణంలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఫౌండర్–చైర్మన్ పాస్టర్ నాగేశెట్టి డానియల్ నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సంఘస్తులు భారీ సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.ఈ సందర్భంగా ప్రసంగించిన పాస్టర్ నాగేశెట్టి డానియల్ మాట్లాడుతూ, “దుఃఖాన్ని తొలగించేదే నిజమైన క్రిస్మస్” అని అన్నారు. క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి భూలోకానికి వచ్చాడని, తండ్రి అప్పగించిన బాధ్యతను కుమారుడు తూచా తప్పకుండా నిర్వర్తించాడని తెలిపారు.క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి, అలాగే భారతదేశ ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే రోజు ఇదేనని పేర్కొన్నారు. ప్రభువు ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని ఆయన ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది సంఘస్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !