+91 99635 77856

హుజురాబాద్ ను పివి జిల్లాగా ప్రకటించాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్ ను పివి జిల్లాగా ప్రకటించాలి

హుజురాబాద్ /జనవరి08(మా అక్షరం):హుజురాబాద్‌ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ....హుజురాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, జనాభా అన్నీ పూర్తిగా ఉన్నాయని తెలిపారు.హుజురాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలను కలుపుకుంటే సుమారు ఆరు లక్షల జనాభా ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో హుజురాబాద్ డివిజన్‌గా కొనసాగిందని, అందువల్ల వెంటనే జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజురాబాద్‌ను జిల్లాగా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పివి జిల్లా సాధన కమిటీ కన్వీనర్ ఈమోజు సదానందం తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్ /జనవరి08(మా అక్షరం):హుజురాబాద్‌ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ….హుజురాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, జనాభా అన్నీ పూర్తిగా ఉన్నాయని తెలిపారు.హుజురాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలను కలుపుకుంటే సుమారు ఆరు లక్షల జనాభా ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో హుజురాబాద్ డివిజన్‌గా కొనసాగిందని, అందువల్ల వెంటనే జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజురాబాద్‌ను జిల్లాగా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పివి జిల్లా సాధన కమిటీ కన్వీనర్ ఈమోజు సదానందం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !